← Back to news

ఆస్తులు ఉన్నా అంత్యక్రియలకు ఎవరూ రాలేదు!

By BK· 16 Aug 2026
ఆస్తులు ఉన్నా అంత్యక్రియలకు ఎవరూ రాలేదు!

ఆస్తులున్నా ఆత్మీయులు లేక ఓ కుబేరుడు అనాథగా కన్నుమూశాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన కోటీశ్వరుడు రాజకుమార్ సక్సేనాకు ఆస్తులు, ముగ్గురు కొడుకులు, కూతురు, భార్య ఉన్నారు. ఆస్తులన్నీ రాయించుకున్నాక అతడిని ఇంట్లోంచి వెళ్లగొట్టారు. వృద్ధాశ్రమంలో ఉన్న ఆయన అనారోగ్యంతో ఈ నెల 11న ఆస్పత్రిలో మరణించారు. చనిపోయేముందు కుటుంబాన్ని చూడాలనుకున్నా ఆయన కోరిక తీరలేదు. డాక్టర్లు సమాచారమిచ్చినా తమకేం సంబంధం లేదని చెప్పారు. చివరికి పోలీసులే స్వచ్ఛంద సంస్థ సాయంతో అంత్యక్రియలు జరిపించారు.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 10h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.