← Back to news

AIతో పరిశోధనల్లో అద్భుత ఫలితాలు: కృష్ణ ఎల్ల

By DK· 18h ago
AIతో పరిశోధనల్లో అద్భుత ఫలితాలు:  కృష్ణ ఎల్ల

TG: విద్యార్థులు సామాజిక మాధ్యమాలపై సమయం వృథా చేయకుండా కృత్రిమ మేధ (AI)పై దృష్టి పెట్టాలని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్ల సూచించారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన 85వ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో AI అద్భుత ఫలితాలు సాధిస్తోందని, జీవశాస్త్రం, ఫార్మా పరిశోధనల్లోనూ అనూహ్య ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. విద్యార్థులకు సృజనాత్మకత, నైపుణ్యాలు, ఊహాశక్తి కీలకమని పేర్కొన్నారు.

More in Education