YCP కీలక నేత రాజీనామా

AP: విజయనగరం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శీను) పార్టీకి రాజీనామా చేశారు. విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా గతంలో పనిచేసిన ఆయన, ప్రస్తుతం భీమిలీ నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు భీమిలీ నియోజకవర్గ సమన్వయకర్త, విజయనగరం జిల్లా అధ్యక్ష పదవులకు కూడా రాజీనామా చేస్తున్నట్లు మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికి పంపించారు.




