← Back to news

HYDలో నేటి నుంచి మట్టి గణేశ ప్రతిమల పంపిణీ

By DK· 19h ago
HYDలో నేటి నుంచి మట్టి గణేశ ప్రతిమల పంపిణీ

TG: పర్యావరణ పరిరక్షణలో భాగంగా HMDA ఆధ్వర్యంలో 1.33 లక్షల మట్టి గణేశుడి ప్రతిమలను బుధవారం నుంచి ఈ నెల 13 వరకు హైదరాబాద్ నగరంలోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో పంపిణీ చేయనున్నారు. 8 ఇంచ్‌ల పరిమాణంలో 80వేల ప్రతిమలు, ఒక అడుగు పరిమాణంలో 53వేల ప్రతిమలు ఉన్నాయి. KBR పార్కు, ట్యాంక్‌బండ్, సచివాలయం, హైకోర్టు, శిల్పారామం, మైండ్‌స్పేస్ జంక్షన్, HMDA కార్యాలయం తదితర ప్రాంతాల్లో పంపిణీ చేపడతారు. ప్రతిమలు కావాల్సిన వారు ఈఈ వెంకట శ్రీనివాస్ 9849906745, డిప్యూటీ ఈఈ జె.గణేష్ 7989371104 నంబర్లకు సంప్రదించవచ్చు.

More in TG