లడఖ్ భవిష్యత్తుపై ఢిల్లీలో బిగ్ మీటింగ్

లడఖ్ హక్కుల సాధన కోసం కేంద్ర హోంశాఖతో స్థానిక నేతల చర్చలు సెప్టెంబర్ 9న ఢిల్లీలో పునఃప్రారంభం కానున్నాయి. లడఖ్‌కి చెందిన ప్రధాన లీడర్స్ 'లేహ్ అపెక్స్ బాడీ', 'కార్గిల్ డెమోక్రటిక్ అలైయన్స్' ప్రతినిధులు ఈ మీటింగ్ కోసం ఢిల్లీ చేరుకున్నారు. లడఖ్ ప్రాంత భూమి, సంస్కృతి, ఉద్యోగాలు, పర్యావరణ పరిరక్షణ కోసం తమ ప్రాంతాన్ని రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్‌లో చేర్చాలని వారు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. గత చర్చల కొనసాగింపుగా జరుగుతున్న ఈ సమావేశంపై లడఖ్ ప్రజల్లో భారీగా హోప్స్ ఉన్నాయి.


