← Back to news

రెండో రోజుకు చేరిన సచివాలయ ఉద్యోగుల దీక్ష

By mahesh nani· 2h ago· Ntr జిల్లా
రెండో రోజుకు చేరిన సచివాలయ ఉద్యోగుల దీక్ష

AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం విజయవాడ గాంధీ బొమ్మ సెంటర్‌లో చేపట్టిన మూడు రోజుల నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. AAS, నోషనల్ ఇంక్రిమెంట్లు, పెండింగ్ బకాయిల చెల్లింపు, పదోన్నతులు, ఇతర సేవా సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. రెండో రోజు కూడా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆందోళన కొనసాగించారు. సర్వీసులో చేరిన కాలానికి సంబంధించిన నోషనల్ ఇంక్రిమెంట్లు, AAS ప్రయోజనాలు, పెండింగ్ ఆర్థిక బకాయిలపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.

More in Local