← Back to news

ఇంట్లోనే ప్రొటీన్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసా?

By sahani· 11 Jun 2026· Andhrajyothy
ఇంట్లోనే ప్రొటీన్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసా?

మార్కెట్లో దొరికే ఖరీదైన ప్రొటీన్ పౌడర్స్ బదులు, ఇంట్లోనే నాచురల్‌గా తయారు చేసుకోవచ్చు. బాదం, వేయించిన వేరుశెనగ, జీడిపప్పు (ఒక్కో కప్పు), ఓట్స్, అవిసె గింజలు (అర కప్పు), గుమ్మడి గింజలను లైట్‌గా ఫ్రై చేసి, చల్లార్చాక మిక్సీ పట్టి పౌడర్ చేసుకోవాలి. ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడి మిక్స్ చేసి ఎయిర్ టైట్ జార్‌లో దాచుకోవచ్చు. రోజూ 1-2 స్పూన్ల పౌడర్‌ను మిల్క్ తో తీసుకుంటే మజిల్ గ్రోత్ బాగుంటుంది, బాడీకి మంచి ఎనర్జీ వస్తుంది. Note: ఇందులోని ఇన్ఫర్మేషన్ అవగాహన కోసం మాత్రమే. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది.

More in Health