హెల్త్ కోసం డైట్ మార్చేస్తున్న GenZ!

ఇండియాలో ఫుడ్ ట్రెండ్స్ పూర్తిగా మారిపోతున్నాయి. ప్రస్తుతం దేశంలో 35% ఫుడ్ ఖర్చులను GenZ మాత్రమే డిసైడ్ చేస్తోంది. వీళ్లు ఏదైనా ఫుడ్ ప్రొడక్ట్ కొనే ముందు బ్రాండ్‌ని కాకుండా, బాటిల్ వెనకాల ఉండే లేబుల్స్, ఇంగ్రీడియెంట్స్ పక్కాగా చెక్ చేస్తున్నారు. దాదాపు 79% GenZ తమ డైట్‌ను ఇంప్రూవ్ చేసుకోవాలని చూస్తుండగా, 83% హెల్త్ కోసం లైఫ్‌స్టైల్ మార్చుకోవడానికి రెడీగా ఉన్నారు. దీంతో పెద్ద పెద్ద ఫుడ్ కంపెనీలు కూడా GenZ టేస్ట్‌కి తగ్గట్టుగా తమ ప్రొడక్ట్స్ మారుస్తున్నాయి.





