ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో న్యూ బిల్డింగ్స్

తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులోని ఏపీఎస్డబ్ల్యూ మహిళా డిగ్రీ కళాశాలలో కొత్తగా నిర్మించిన తరగతి గదులను మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. PM-USHA పథకం కింద రూ.3.86 కోట్ల వ్యయంతో ఈ భవనాలు నిర్మించారు. ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలు అభివృద్ధి చేస్తామన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ కళాశాలల్లో పరిశోధన, ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామకుమారి పాల్గొన్నారు.


