← Back to news

పాము కనిపిస్తే.. ఇక ఫోన్‌లోనే Rescue Help!

By Nani Garikina· 26 Aug 2026· Ndtv
పాము కనిపిస్తే.. ఇక ఫోన్‌లోనే Rescue Help!

ఇంట్లో ఒక్కసారిగా పాము కనిపిస్తే, భయంతో దాన్ని పట్టుకోవాలని లేదా చంపాలని ప్రయత్నించడం ప్రమాదమే. ఈ సమస్యకు టెక్నాలజీతో పరిష్కారం చూపేందుకు మధ్యప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ‘SHIVAA’ అనే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేస్తోంది. ఇందులో దగ్గర్లో ఉన్న రిజిస్టర్డ్ స్నేక్ రెస్క్యూయర్‌ను సంప్రదించే అవకాశం ఉంటుంది. పాముకాటు జరిగితే ఫస్ట్ ఎయిడ్ సూచనలు, యాంటీ-స్నేక్ వెనం అందుబాటులో ఉన్న హాస్పిటల్స్ సమాచారం కూడా లభిస్తుంది. అక్టోబర్ 2–8 మధ్య వైల్డ్‌లైఫ్ వీక్‌లో దీనిని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

పాము కనిపిస్తే.. ఇక ఫోన్‌లోనే Rescue Help!

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 6h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.