AP· 13h ago
పోలీసు క్రీడాకారులకు ఆధునిక సౌకర్యాలు: DGP
AP: పోలీసు క్రీడాకారులను జాతీయస్థాయిలో రాణించేలా తీర్చిదిద్దేందుకు ‘ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అకాడమీ’ ఏర్పాటు చేస్తున్నట్లు DGP హరీష్‌కుమార్ గుప్తా ప్రకటించారు. మంగళగిరిలో జరిగిన ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2026 ముగింపు కార్యక్రమంలో ఆయన అకాడమీ లోగోను ఆవిష్కరించారు. క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణ, ఆధునిక పరికరాలు, మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. నాలుగు రోజులపాటు జరిగిన పోటీల్లో 1,900 మంది పాల్గొనగా, మహిళలు, పురుషుల విభాగాల్లో విశాఖపట్నం రేంజ్ ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచింది.