రణ్‌వీర్ సింగ్‌పై బ్యాన్ వెనక్కి..

బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ 'డాన్ 3' సినిమా నుండి తప్పుకున్నాక, FWICE యూనియన్ ఆయనపై విధించిన ఇన్‌ఫార్మల్ బ్యాన్‌ను వెనక్కి తీసుకుంది. ఈ ఇష్యూతో ఫిల్మ్ యూనియన్లకు ఇండస్ట్రీలో ఎంత ఇన్‌ఫ్లుయెన్స్ ఉన్నా, లీగల్ పవర్స్ మాత్రం చాలా లిమిటెడ్‌గా ఉంటాయని తేలింది. ఈ యూనియన్లు ప్రైవేట్ ట్రేడ్ గ్రూప్స్ మాత్రమే కానీ, ప్రభుత్వ సంస్థలు కావు. అందుకే ఎవరినీ లీగల్‌గా పని చేయకుండా ఆపలేవు. ఒకవేళ బ్యాన్ లాంటివి విధిస్తే, అది ఒకరి బ్రతుకుదెరువును దెబ్బతీయడమే అవుతుందని, కోర్టులో సవాల్ చేయొచ్చని లీగల్ ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు.



