జ్ఞానేశ్ కుమార్‌పై కేరళం మాజీ చీఫ్ సెక్రటరీ కామెంట్స్

ప్రస్తుత CEC జ్ఞానేశ్ కుమార్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో కేరళం రాష్ట్రంలోని పతనంతిట్ట నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేయమని అప్పట్లో తనకు చెప్పారని కేరళ మాజీ చీఫ్ సెక్రటరీ జి.జి.థామ్సన్ చెప్పడం సంచలనంగా మారింది. ఇది అధికారిక ఆఫర్ కాదని, సలహా మాత్రమే అని థామ్సన్ చెప్పారు. 2015-16లో ఢిల్లీకి వెళ్తున్న విమానంలో ఈ మాటలు జరిగాయన్నారు. ఈ విషయాన్ని అభిజీత్ దీప్కే పోస్ట్ చేస్తూ ‘ఇలాంటి వ్యక్తి పారదర్శక ఎన్నికలను నిర్వహిస్తాడా?’ అంటూ కామెంట్ చేశారు.


