← Back to news

EC వివరణపై చంద్రబాబు పోస్ట్

By Mahesh· 15h ago· X· AP
EC వివరణపై చంద్రబాబు పోస్ట్

AP: ఎన్నికల సంఘం ఇచ్చిన <a href="https://www.theclearcutnews.com/n/64YJ6H6">ఏకగ్రీవ వివరణ</a>తో అన్ని అపోహలకు తెరపడిందని CM చంద్రబాబు <a href="https://x.com/ncbn/status/2103845933679325655">'X'లో పోస్ట్ చేశారు.</a> CEC జ్ఞానేశ్ కుమార్, ECలు సంధు, వివేక్ జోషిల నిర్ణయాలు ఇన్‌స్టిట్యూషనల్ రూల్స్ ప్రకారమే తీసుకున్నారని తెలిపారు. షార్ట్‌టర్మ్ పాలిటిక్స్ ప్రయోజనాల కోసం దేశ ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని దెబ్బతీయడం సరికాదన్నారు. ఎన్నికల ఫలితాలు ప్రజల తీర్పని, గెలుపోటములను నేతలు స్పోర్టివ్‌గా తీసుకోవాలని అన్నారు. ప్రజల్లో రాజ్యాంగ సంస్థలపై నమ్మకం నిలబెట్టడం అందరి బాధ్యతన్నారు.

More in AP