← Back to news

UPI వద్దే వద్దు.. బంకుల్లో మొదలైన నిరసన!

By Krishna· 3h ago
UPI వద్దే వద్దు.. బంకుల్లో మొదలైన నిరసన!

అక్టోబర్ 15 నుంచి పెట్రోల్ లేదా డీజిల్ కొనుగోళ్లలో 2,000 రూపాయలు దాటిన UPI చెల్లింపులపై డీలర్లు 5 రూపాయలు ఫ్లాట్ MDR చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని ఏపీ, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా పెట్రోల్ డీలర్ల అసోసియేషన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమ మార్జిన్లు లీటరుకు 2 రూపాయల 40 పైసల నుంచి 3 రూపాయల 40 పైసలు మాత్రమే ఉంటాయనీ, MDR ఛార్జీ భారంగా మారుతుందని డీలర్లు చెబుతున్నారు. తమకు మినహాయింపు ఇవ్వకపోతే UPIని ఆపేసి, క్యాష్ మాత్రమే తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

More in Current Affairs