Gen Z కోసం రాజకీయ పార్టీల స్టైల్ మారుతోందా?

రాజకీయాల్లో యువతను ఆకట్టుకోవడానికి ఇప్పుడు పార్టీలు తమ ప్రచార శైలిని మార్చుకుంటున్నాయా? తాజాగా ఈ ట్రెండ్ సోషల్ మీడియాలో స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీ రాష్ట్రాల సోషల్ మీడియా ఖాతాలు మీమ్స్, సినిమాల సీన్లు, హాస్య వీడియోలు, పాప్ కల్చర్ రిఫరెన్స్‌లను రాజకీయ సందేశాలతో కలిపి ప్రచారం చేస్తున్నాయి. కారణం, యువత రాజకీయాల గురించి కూడా ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, మీమ్స్ ద్వారా తెలుసుకుంటున్నారు. అందుకే వాళ్లకు చేరాలంటే సంప్రదాయ ప్రసంగాల కంటే, వాళ్లకు తెలిసిన డిజిటల్ భాషలో మాట్లాడాల్సిన అవసరం పెరుగుతోంది.



