మహిళలు గడప దాటితే వినాశనమా?!

కేరళం ఇస్లామిక్ మతపెద్ద అబూబకర్ ముస్లియార్ మహిళలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. మహిళలు ఇళ్లకే పరిమితం కావాలని, వారు గడప దాటి బహిరంగ వేదికలు ఎక్కితే మహా వినాశనానికి దారితీస్తుందని కొచ్చి సదస్సులో అన్నారు. ఖురాన్ కూడా ఇదే చెబుతోందని, అందుకే ఇస్లాంలో పరదా సంస్కృతి ఉందంటూ సమస్త కేరళ జమియ్యతుల్ ఉలామా జనరల్ సెక్రటరీ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్‌పై కేరళం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి బిందు కృష్ణ, CPM లీడర్ పీకే శ్రీమతి తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఆ చీకటి రోజులు పోయాయని కౌంటర్ ఇచ్చారు.



