HCUలో ఎస్ఎఫ్‌ఐ గెలుపు.. భువనగిరిలో సంబరాలు

HCU విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఎస్ఎఫ్‌ఐ కూటమి ఘన విజయంతో బుధవారం భువనగిరిలో విద్యార్థులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ప్రిన్స్ చౌరస్తా వద్ద టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు వేముల నాగరాజు, కార్యదర్శి లావుడియ రాజు మాట్లాడుతూ.. క్యాంపస్‌లలో మతోన్మాద శక్తులకు చోటు లేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఇందురాణి, నాయకులు ఉదయ్, జగన్, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.





