బైక్‌పైకి దూసుకెళ్లిన కారు.. వ్యక్తి మృతి

TG: నాగార్జునసాగర్–హైదరాబాద్ ప్రధాన రహదారిపై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం నెల్లికల్ ఎక్స్ రోడ్ సమీపంలోని దయ్యాలగండి వద్ద ద్విచక్ర వాహనంపైకి కారు దూసుకెళ్లడంతో బైక్‌పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు నాగార్జునసాగర్ పైలాన్‌కు చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు. కారు అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపించారు. ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.



