← Back to news

ఫైర్ యాక్సిడెంట్‌లో ఇద్దరు సజీవదహనం

By dk yamjala· 2 Jun 2026· Eenadu· ఏలూరు జిల్లా
ఫైర్ యాక్సిడెంట్‌లో ఇద్దరు సజీవదహనం

TG: ఏలూరు జిల్లా వేలేరుపాడులో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఇంటికి మంటలు అంటుకోవడంతో ఇద్దరు మహిళలు నిద్రలోనే సజీవదహనమయ్యారు. వలగాని సావిత్రి (60), పూలమ్మ (65) నిద్రిస్తుండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఇద్దరూ మృతి చెందారు. మంటల ధాటికి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. పెద్దఎత్తున ఎగిసిపడడంతో పక్కనే ఉన్న మరో ఇల్లు కూడా కాలిబూడిదైంది. తెలంగాణలోని సూర్యాపేట జిల్లాకు చెందిన పూలమ్మ తన చెల్లిని చూసేందుకు ఏలూరు వచ్చినట్లు సమాచారం.

More in AP