సిమ్ విషయంలో ఈ తప్పు చేస్తే.. భారీ మూల్యం!

ఫ్రెండ్ కోసం సిమ్ తీసి ఇవ్వడం, మీ పేరుతో ఉన్న సిమ్‌ను అద్దెకు ఇవ్వడం ఇక బిగ్ రిస్క్! నకిలీ పత్రాలతో సిమ్ తీసుకోవడం, ఇతరుల పేరుతో యాక్టివేట్ చేయడం, IMEI ట్యాంపరింగ్ చేయడం చట్టవిరుద్ధమని DoT(Department of Telecommunications) తెలిపింది. నిబంధనలు ఉల్లంఘిస్తే మూడేళ్ల వరకు జైలు, రూ.50 లక్షల వరకు జరిమానా పడొచ్చు. మీ పేరుతో ఉన్న సిమ్‌లను సంచార్ సాథీ ద్వారా చెక్ చేసుకోండి.


