← Back to news

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. మరొకరు మృతి

By DK· 13 Jun 2026· Samayam· విశాఖపట్నం జిల్లా
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. మరొకరు మృతి

AP: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పదికి చేరింది. సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సూరిబాబు అనే కాంట్రాక్ట్ కార్మికుడు శనివారం చనిపోయాడు. జూన్ 8వ తేదీన విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఉక్కుద్రవం లీకై ప్రమాదం చోటుచేసుకుంది. ప్లాంట్‌లోని ద్రవఉక్కు ల్యాడిల్ పేలటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందగా, శనివారం సూరిబాబు అనే ఉద్యోగి చనిపోవటంతో మృతుల సంఖ్య పదికి చేరింది. మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు.

More in AP