బ్యాంకుల సమ్మె.. కేంద్రం విజ్ఞప్తి

బ్యాంకు ఉద్యోగులు సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు దేశవ్యాప్త సమ్మెకు సిద్ధమవుతున్నారు. దీంతో ప్రజలకు అందించే బ్యాంకింగ్ సేవలకు ఇబ్బందులు రావొచ్చంటున్న కేంద్రం.. ఉద్యోగులు తమ సమస్యలను సమ్మెతో కాకుండా, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోరింది. ఐతే.. ఉద్యోగులు ప్రధానంగా వీక్లీ 5 వర్కింగ్ డేస్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చాలా కాలంగా ఈ డిమాండ్ ఉంది. సమ్మె అమలైనా.. డిజిటల్, ఆన్‌లైన్, UPI సేవలు కొనసాగుతాయి.


