← Back to news

ఒక్క మందు.. కోట్ల రాబందులకు ముప్పు!

By Lokesh· 2h ago· Indiatimes
ఒక్క మందు.. కోట్ల రాబందులకు ముప్పు!

1990లలో భారత్‌లో రాబందుల సంఖ్య భారీగా తగ్గడం మొదలైంది. పశువులకు ఇచ్చే ‘డైక్లోఫెనాక్’ అనే నొప్పి తగ్గించే మందు దీనికి ప్రధాన కారణం. ఈ మందు తీసుకున్న పశువులు చనిపోయిన తర్వాత వాటి కళేబరాలను రాబందులు తినేవి. దీంతో రాబందుల సంఖ్య 99 శాతానికి పైగా తగ్గిపోయింది. పరిస్థితిని గుర్తించిన ప్రభుత్వం 2006లో పశువులకు డైక్లోఫెనాక్ వాడకాన్ని నిషేధించింది.

More in National