← Back to news

పార్టీలను చీల్చి గుర్తులు లాక్కుంటున్నారు: రాహుల్‌

By Anusha· 3h ago
పార్టీలను చీల్చి గుర్తులు లాక్కుంటున్నారు: రాహుల్‌

త్వరలో పశ్చిమ బెంగాల్‌ ఉప ఎన్నికల జరుగనున్నాయి. TMC పేరు, ఎన్నికల గుర్తును వాడకుండా రెండు వర్గాలను EC ఆదేశించింది. దీనిపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ EC, BJPపై తీవ్ర విమర్శలు చేశారు. శివసేన, NCP తర్వాత ఇప్పుడు TMCని చీల్చేందుకు కూడా ఇదే పద్ధతి అనుసరిస్తున్నారని ఆరోపించారు. ప్రజల తీర్పును కాపాడాల్సిన EC అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందన్నారు. ఈ పోరాటం మమతా బెనర్జీది మాత్రమే కాదని, స్వేచ్ఛాయుత ఎన్నికలు కోరుకునే ప్రతి ఓటరు పోరాటం అని పేర్కొన్నారు.

More in National