← Back to news

జమ్మి చెట్టుతోనే జమ్మిగడ్డకు పేరు

By Yadla Venudhar· 1h ago· Suryapet (Municipality), Suryapet, Suryapet
జమ్మి చెట్టుతోనే జమ్మిగడ్డకు పేరు

సూర్యాపేట పట్టణంలోని 20వ వార్డు జమ్మిగడ్డలో తరతరాలుగా దసరా సంప్రదాయం కొనసాగుతోంది. నిజాం పాలన నాటి చారిత్రక నేపథ్యం ఈ వేడుకలకు ఉంది. అప్పట్లో ప్రస్తుత ఎంపీడీవో కార్యాలయ ప్రాంతంలో ఎత్తైన ప్రదేశంలో భారీ పురాతన జమ్మి చెట్టు ఉండేది. విజయదశమి రోజున పట్టణం, పరిసర గ్రామాల ప్రజలు వాహనాలు, పనిముట్లు, ఆయుధాలతో వచ్చి శమీ పూజ చేసేవారు. జమ్మి చెట్టు ఉండటంతోనే కాలక్రమేణా జమ్మిగడ్డగా పేరు స్థిరపడిందని స్థానికులు చెబుతున్నారు.

జమ్మి చెట్టుతోనే జమ్మిగడ్డకు పేరు

More in Local