మందు తాగి పాటలు పాడుతున్నావా?.. దలేర్ మెహందీపై ఆగ్రహం
ప్రముఖ భంగ్రా పాప్ గాయకుడు దలేర్ మెహందీని ఓ ఎమ్మెల్యే తిట్టడం కాంట్రవర్సీగా మారింది. ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ గఢ్‌వాల్ ప్రాంతంలో ప్రసిద్ధ కుంజపురి మేళా సందర్భంగా ఓ సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో దలేర్ మెహందీ తన బృందంతో కలిసి పాల్గొన్నారు. మంత్రి, స్థానిక నాయకుడు సుబోధ్ ఉనియాల్ నేరుగా స్టేజ్‌పైకి వచ్చి, దలేర్ మెహందీ ప్రవర్తనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఆల్కహాల్ తాగి పాటలు పాడుతున్నావా?’ అంటూ నిలదీశారు.


