ఆరు నెలల ముందే బయటపడిన ఆలయం

TG : శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తగ్గడంతో సోమశిల దగ్గర్లోని కృష్ణా నదిలో ఉన్న హిస్టారికల్ సంగమేశ్వర ఆలయం బయటపడింది. సాధారణంగా ఉగాది తర్వాత కనిపించే ఈ టెంపుల్, వర్షాలు తగ్గడం వల్ల ఆరు నెలల ముందే బయటపడటం విశేషం. సుమారు 25 ఏళ్ల తర్వాత ఇలా జరగడంతో దసరా పండుగ సందర్భంగా ఆలయంలో పూజలు నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు.

