"భట్టి కుట్ర చేస్తున్నారు": RS ప్రవీణ్
TG: తెలంగాణ DCN భట్టి విక్రమార్క శాఖలో భారీ స్కాం జరుగుతోందని BRS నేత ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. 2016లో అప్పటి BRS ప్రభుత్వం.. ట్రాన్స్‌కో టెండర్లలో SCలకు 15%, BCలకు 27%, STలకు 10% కాంట్రాక్టులు ఇవ్వాలని నిర్ణయించగా.. ఇప్పుడు 300 సబ్‌స్టేషన్ల నిర్మాణ కాంట్రాక్టులను SC, ST, BCలకు ఇవ్వాల్సి వస్తుందని కుట్ర చేస్తున్నారని ఆయన అన్నారు. సబ్‌స్టేషన్లను ప్రత్యేక ప్యాకేజీలుగా విభజించి కాంట్రాక్టులను SC, ST, BCలకు రాకుండా చేస్తున్నారని ఆరోపించారు.


