← Back to news

హిట్ అండ్ రన్‌లో 9 మందికి గాయాలు.. డ్రైవర్ పరార్!

By Mahesh· 11h ago· HYD Mail· హైదరాబాద్‌

TG: హైదరాబాద్‌ ECILలోని కమలానగర్‌లో అర్ధరాత్రి హిట్ అండ్ రన్ జరిగింది. నిన్న అర్ధరాత్రి జరిగిన ఈ యాక్సిడెంట్‌లో 9 మందికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి కండిషన్ క్రిటికల్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితులంతా బిహార్‌కు చెందిన వారీగా గుర్తింపు. గాయపడిన వారికి ECILలోని సూర్య ఆర్థోపెడిక్ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. యాక్సిడెంట్‌కు సంబంధించిన విజువల్స్ CCTVలో రికార్డు అయ్యాయి. పరారైన వెహికల్ డ్రైవర్ కోసం పోలీసులు సెర్చ్ చేస్తున్నారు.

More in TG