← Back to news

Convocation‌కు రెడీ.. 38 మందికి Gold Medals

By Prashanth· 3h ago· Telangana
Convocation‌కు రెడీ.. 38 మందికి Gold Medals

TG: అంబేద్కర్ ఓపెన్‌ యూనివర్సిటీ 27వ Convocationకు రెడీ అయ్యింది. అక్టోబర్‌ 7న జూబ్లీహిల్స్‌లోని యూనివర్సిటీ ఆడిటోరియంలో ఇది జరుగుతుంది. గవర్నర్‌, వర్సిటీ ఛాన్సలర్‌ శివప్రతాప్‌ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై పట్టాలు, 38 మందికి గోల్డ్ మెడల్స్ ఇస్తారు. మొత్తం 36,145 మంది విద్యార్థులకు డిగ్రీ, పీజీ, డిప్లొమా సర్టిఫికెట్లు ఇస్తారు. 2026-27లో 13 కొత్త ప్రోగ్రామ్స్‌ ప్రారంభిస్తామని VC ఘంటా చక్రపాణి తెలిపారు.

More in TG