పంటలకు MSP పెంపు

రబీ పంటలకు మద్దతు ధర పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయాలు తీసుకుంది. పెంపుతో గోధుమలకు MSP క్వింటాల్‌కి 2,610 రూపాయలు అవ్వగా, ఎర్రపప్పుకి 7,390, శనగలకు 5,958, ఆవాలకు 6,613, కుసుమకు 7,215, బార్లీకి 2,286 రూపాయలైంది. ఈ పెంపు ద్వారా రైతులకు అయ్యే దిగుబడి ఖర్చులకు కొంతైనా లాభం పెరిగే ఛాన్స్ ఉంటుంది. పప్పు ధాన్యాల సాగును పెంచే లక్ష్యంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.



