← Back to news

AI డేటా సెంటర్ పనులు బంద్.. ఎందుకో తెలుసా?

By Nani Eluri· 3h ago· Reuters
AI డేటా సెంటర్ పనులు బంద్.. ఎందుకో తెలుసా?

ఇండోనేషియాలో భారీ AI డేటా సెంటర్ నిర్మాణానికి బ్రేక్ పడింది. సింగపూర్‌కు చెందిన BDx కంపెనీ వెస్ట్ జావాలో 640 మెగావాట్ల డేటా సెంటర్ నిర్మిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు అవసరమైన కొన్ని అనుమతులు ఇంకా రాలేదు. ముఖ్యంగా డేటా సెంటర్ వల్ల పర్యావరణంపై ఎలాంటి ప్రభావం పడుతుందో పూర్తి స్థాయిలో చెక్ చేయలేదు. దీంతో ఆ పనులను వెంటనే ఆపాలని వెస్ట్ జావా గవర్నర్ ఆదేశించారు. పర్యావరణ ప్రభావాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాతే పనులు కొనసాగించాలని చెప్పారు.

More in National