ఓటర్ల హక్కులు రక్షించాలి: డి.కె.శివకుమార్

ప్రతి నిజమైన ఓటరుకు తన ఓటు హక్కు దక్కాలని కాంగ్రెస్ నేత, కర్ణాటక సీఎం డి.కె.శివకుమార్ చెప్పారు. SIR ప్రక్రియలో ఫారమ్-7 అభ్యంతరాలపై నియోజకవర్గాల వారీగా వివరాలు అందించాలని ఆయన CEOను ఆదేశించారు. బల్క్ అబ్జెక్షన్ల సంఖ్య, కారణాలు లేకుండా లేదా అవసరమైన వివరాలు ఇవ్వకుండా ఓటర్ల తొలగింపు కోసం వచ్చిన అభ్యంతరాల సంఖ్య చెప్పాలని కోరారు. ఎన్నికల ప్రక్రియ న్యాయంగా, నిజమైన ఓటర్లను ఓటు హక్కు నుంచి దూరం చేసే ఏ అడ్డంకి లేకుండా ఉండాలని చెప్పారు.



