మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలిగా కొత్తకోట్ల లక్ష్మీ

శ్రీకాకుళం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొత్తకోట్ల లక్ష్మీ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్తకోట్ల లక్ష్మీ గతంలో ZPTC, MPTCగా పోటీ చేయడంతో పాటు రాహుల్ గాంధీతో కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. ఆమె ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ MLA అభ్యర్థిగా పోటీ చేసిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కొత్తకోట్ల సింహాద్రి నాయుడు సతీమణి.


