గాంధీ జయంతి.. మాదక ద్రవ్యాలకు నో!

అనంతపురం జిల్లా రాయదుర్గం ఎస్సీ బాలుర హాస్టల్ విద్యార్థులు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. గాంధీ జయంతి సందర్భంగా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మద్యం, గుట్కా, పొగాకు, డ్రగ్స్‌కు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ. చెడు స్నేహాలు, అలవాట్లకు లోనుకావద్దని, శాస్త్రీయ దృక్పథంతో ఉన్నత చదువులు చదవాలని సూచించారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.



