మంగళగిరి ఏపీఐఐసీ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం

AP: మంగళగిరి ఏపీఐఐసీకి చెందిన 116.88 ఎకరాల భూములపై 25 ఏళ్లుగా ఉన్న సమస్యకు పరిష్కారం దొరికింది. చెరువు పోరంబోకు భూములను అసైన్డ్ వేస్ట్ డ్రై ల్యాండ్‌గా మార్చడంతోపాటు, భూముల బదలాయింపును చట్టబద్ధం చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 2003 నాటి ధరల ప్రకారం ఎకరాకు రూ.2,87,375 చొప్పున రూ.3.36 కోట్లు ఏపీఐఐసీ ప్రభుత్వం చెల్లించనుంది. ఈ భూముల్లో ఆటోనగర్, ఐటీ, పారిశ్రామిక పార్కులతో పాటు టిడ్కో, రాజీవ్ గృహకల్పలో సుమారు 2,500 కుటుంబాలు ఉన్నాయి.



