గవర్నర్ ను కలసిన విజయ్... రెండు వారాల గడువు కోరిన తలపతి

తమిళనాడు గవర్నర్ ను టీవీకే పార్టీ అధినేత విజయ్ మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు సుముఖంగా ఉన్నానని, రెండు వారాల గడువు కావాలని కోరారు. ఇప్పటికే కాంగ్రెస్ విజయ్ తో టచ్ లోకి వచ్చింది. డీఎంకె నేతలు కూడా కొందరు విజయ్ వైపు మొగ్గేందుకు సుముఖంగా ఉన్నారు. ఇవాళ పార్టీ అంతర్గత సమావేశం ఏర్పాటు చేసినా కొందరు ఎమ్మెల్యేలు మీటింగ్ కు దూరంగా ఉన్నారు. 108 సీట్లు గెలుచుకున్న విజయ్ కు ప్రభుత్వ ఏర్పాటుకు పది సీట్లు అవసరమవుతాయి.



