బాధితులకు భరోసా ఏది? : మేడా శ్రీనివాస్

AP: సైబర్ మోసాల్లో పోయిన డబ్బు ఎంత రికవరీ చేశారో ప్రజలకు లెక్క చెప్పాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరంలోని ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో వేల కోట్ల రూపాయల సైబర్ మోసాలు జరుగుతున్నా.. వాటిని అరికట్టేందుకు ఖర్చు చేస్తున్న ప్రజాధనానికి తగ్గ ఫలితం కనిపించడం లేదని విమర్శించారు. పోలీస్ స్టేషన్ల నుంచి ప్రత్యేక సైబర్ క్రైమ్ విభాగాల వరకు ఫిర్యాదులపై వేగంగా స్పందించే వ్యవస్థ ఉండాలని కోరారు.



