← Back to news

రాజాంలో 64 మందికి CM రిలీఫ్ ఫండ్ చెక్కులు

By Mohan· 2h ago· Rajam, Rajam, Vizianagaram
రాజాంలో 64 మందికి CM రిలీఫ్ ఫండ్ చెక్కులు

విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గానికి చెందిన 64 మంది బాధితులకు MLA కొండ్రు మురళీమోహన్ CM రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఆదివారం రాజాంలోని MLA క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు చెక్కులు అందజేశారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని MLA తెలిపారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న అర్హులైన వారికి CM రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందేలా చూస్తామని చెప్పారు.

More in Local