← Back to news

నీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు: సర్పంచ్

By Harish Reddy· 2h ago· Jagtial, Jagtial
నీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు: సర్పంచ్

జగిత్యాల జిల్లా భీమారం మండలం లింగంపేటలో సర్పంచ్ సుప్రియ హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో ఎల్‌నినో ప్రభావంతో ప్రజలకు నీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు, ఫార్మ్ పండ్స్ ఏర్పాటు చేసుకోవాలని, నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని కోరారు. VBG రామ్ జీ ద్వారా గ్రామంలో ఉన్న సమస్యలు గుర్తించి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

More in Local