← Back to news

పోలవరం కాలువలో బాలుడు గల్లంతు

By dk· 13 Aug 2026· కృష్ణా జిల్లా
పోలవరం కాలువలో బాలుడు గల్లంతు

AP: కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపనేనిగూడెం వద్ద సైకిల్‌పై వెళ్తున్న 12ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్తు పోలవరం కుడి కాలువలో పడి గల్లంతయ్యాడు. గ్రామానికి చెందిన ఆరుమళ్ల లీలామోహన్‌రెడ్డి స్థానిక పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. స్నేహితుల వద్దకు వెళ్తున్నానని చెప్పి సైకిల్‌పై ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. కాల్వలో జారిపడి నీటిలో పడిపోయినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే కుటుంబసభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టినట్లు తహసీల్దార్ శివయ్య తెలిపారు.

More in AP