← Back to news

ఆఖరికి ఆ దేశంలోకీ దోమల ఎంట్రీ..!

By aravinda nyayapati· 12 May 2026· Iceland
ఆఖరికి ఆ దేశంలోకీ దోమల ఎంట్రీ..!

ఐస్‌లాండ్ పేరు వింటే మనకు గుర్తొచ్చేది చల్లటి మంచు కొండలు. కానీ ఆ దేశానికి మరో పేరుంది.అదే దోమలు లేని దేశం. ఇప్పుడు ఆ స్టేటస్ అది కోల్పోయింది. ఐస్ లాండ్ లోకి కూడా ఇప్పుడు మస్కిటోలు ఎంట్రీ ఇచ్చేశాయి. వాతావరణ మార్పులతో అక్కడ మంచు కొండలు కరిగిపోయి చలి తగ్గిపోవడంతో దోమలు బతికే పరిస్థితులు ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఐస్‌లాండ్ వెళ్లే ప్లాన్ ఉంటే స్వెట్టర్లతో పాటు ఇకపై మస్కిటో కాయిల్స్ కూడా పట్టుకెళ్లాల్సిందేనేమో!

More in Science

నిద్రలో ఒక్కసారిగా కింద పడుతున్నట్టు ఎందుకు అనిపిస్తుంది? 💤
Science· 21 Aug 2026

నిద్రలో ఒక్కసారిగా కింద పడుతున్నట్టు ఎందుకు అనిపిస్తుంది? 💤

నిద్రలోకి జారుకుంటున్నప్పుడు ఒక్కసారిగా కింద పడుతున్నట్టు అనిపించి ఉలిక్కిపడటం చాలామందికి జరుగుతుంది. దీనిని ‘హిప్నిక్ జర్క్’ అంటారు. నిద్రలోకి మారే సమయంలో కండరాలు ఒక్కసారిగా జర్క్ అవడం వల్ల ఈ అనుభూతి వస్తుంది. మనం నిజంగా పడిపోతున్నామని కాదు.. మెదడు, శరీరం మేల్కొనే స్థితి నుంచి నిద్రలోకి మారుతున్న సమయంలో వచ్చే సహజ స్పందన ఇది. ఒత్తిడి, నిద్రలేమి, ఎక్కువ కెఫీన్ వంటివి దీన్ని మరింత పెంచొచ్చని డాక్టర్లు చెబుతున్నారు. అప్పుడప్పుడు ఇలా జరగడం సాధారణమే. మీకు కూడా ఇలా జరిగిందా? కామెంట్‌లో చెప్పండి. 👇