నేడు ఛలో జంతర్ మంతర్.. CJP పిలుపు
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పార్టీ నేతలు డిటైన్ అయినా CJP వెనక్కి తగ్గడం లేదు. CEC జ్ఞానేశ్ కుమార్ రిజైన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఉదయం 11 గంటలకు జంతర్ మంతర్ దగ్గర మరోసారి ప్రొటెస్టుకు CJP ప్రకటించింది. పార్టీ నేతలను డిటైన్ చేసినా తమ ఆందోళన ఆగదని CJP నేషనల్ ఆర్గనైజేషన్ ఇన్‌ఛార్జ్ అజింక్యా షిండే స్పష్టం చేశారు. ప్రొటెస్టర్స్ అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా అవకతవకలపై CEC బాధ్యత వహించే వరకు ప్రొటెస్ట్ కొనసాగిస్తామన్నారు.



