← Back to news

2013 ముజఫర్‌నగర్ అల్లర్లు..నిందితులను వదిలేస్తే ఎలా?

By Vishi· 15 Aug 2026· Wikipedia· UP
2013 ముజఫర్‌నగర్ అల్లర్లు..నిందితులను వదిలేస్తే ఎలా?

2013 ఉత్తరప్రదేశ్‌ ముజఫర్‌నగర్ అల్లర్లకు సంబంధించిన కేసులో 10 మంది బీజేపీ నాయకులు, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీకి ప్రత్యేక కోర్టు రిలీఫ్ ఇచ్చింది. దీనిపై సోషల్‌మీడియాలో నిరసన వ్యక్తమవుతోంది. హిందూ జాట్‌లు, ముస్లింల మధ్య జరిగిన మతపరమైన హింసను ఆ ప్రాంతవాసులు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. సుమారు 65 మంది దాకా మరణించగా, 50,000 మందికి పైగా ఇళ్లు వదిలి పారిపోయారు. అనేక ఇళ్లు, దుకాణాలు తగలబడ్డాయి. ఇంత దారుణమైన హింసలో నిందితులుగా ఉన్నవాళ్లను కోర్టు ఇలా వదిలేయడం సరికాదని అంటున్నారు.

More in Current Affairs