← Back to news

అమరావతిలో బెడ్‌ఫోర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్

By DK· 12 Jun 2026· Eenadu· అమరావతి
అమరావతిలో బెడ్‌ఫోర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్

AP: బ్రిటన్‌కు చెందిన ప్రముఖ బెడ్‌ఫోర్డ్ విద్యా సంస్థ అమరావతిలో తమ స్కూల్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది. 470 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ స్కూల్‌కు ప్రస్తుతం బెడ్‌ఫోర్డ్‌లో, భారత్‌లోని పంజాబ్ రాష్ట్రం మొహాలిలో మాత్రమే క్యాంపస్‌లు ఉన్నాయి. ఇప్పుడు అమరావతిలో మూడో క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. ఈ స్కూల్‌కు సీఆర్డీఏ తుళ్లూరు సమీపంలో 8 ఎకరాల స్థలం కేటాయించింది. హైదరాబాద్ ఎడ్యుకేషనల్ అకాడమీతో కలిసి ఈ స్కూల్‌ను ఏర్పాటు చేస్తుంది. ఇది అమరావతికి వస్తున్న తొలి విదేశీ విద్యా సంస్థ.

More in Education