← Back to news

జపాన్ ఓపెన్ గెలిచిన తొలి భారత షట్లర్‌గా సింధు రికార్డ్

By DK· 20 Jul 2026
జపాన్ ఓపెన్ గెలిచిన తొలి భారత షట్లర్‌గా సింధు రికార్డ్

భారత స్టార్ షట్లర్ PV సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 సిరీస్‌లో విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆమె జపాన్‌కు చెందిన ప్రపంచ మూడో ర్యాంకర్ అకానె యమగూచిని 21-17, 21-17 తేడాతో వరుస గేమ్‌ల్లో ఓడించింది. ఈ విజయంతో జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన తొలి భారత షట్లర్‌గా సింధు చరిత్ర సృష్టించింది. 2024 డిసెంబరులో సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ తర్వాత టైటిల్ గెలవకపోవడంతో వచ్చిన విమర్శలకు ఈ విజయంతో ఆమె గట్టి సమాధానం ఇచ్చింది. సింధుకు CM చంద్రబాబు, డిప్యూటీ CM పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు.

More in Sports