అర్హతకి మించి విద్యార్హత ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలకు పనికి రారు : సుప్రీం

ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో అర్హతగా ఏం చదవాలని చెప్పారో వారినే తీసుకోవాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అంతకంటే ఎక్కువ చదువుకుంటే వారు ఆ పోస్టుకి అర్హులు కారని తీర్పు చెప్పింది. తమిళనాడు బ్యాంకులో టెంపరరీ అటెండర్ పోస్టుకు ఉద్యోగం పొందిన డిగ్రీ హోల్డర్ వ్యక్తి కేసులో సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. ఉద్యోగం నుంచి అతడిని తొలగించడాన్ని జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ ఆర్. మహదేవన్‌ల బెంచ్ సమర్థించింది. కావాల్సిన దానికంటే అధిక విద్యార్హత ఉన్నవారికి ఉద్యోగాలిస్తే తక్కువ చదువుకున్నవారు, నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని సుప్రీం వ్యాఖ్యానించింది.



