సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు.. Govt.కు కోర్టు ఆదేశం

AP: 16 రోజులుగా కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల సమ్మెకు తెరపడింది. సమ్మెను విరమిస్తున్నట్లు జూనియర్ డాక్టర్లు హైకోర్టుకు తెలిపారు. తమ డిమాండ్లను పరిష్కరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును కోరారు. ఈ డిమాండ్లపై రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. జూనియర్ డాక్టర్ల సమ్మెను సవాలు చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ నేపథ్యంలో జూనియర్ డాక్టర్ల సంఘానికి కోర్టు నిన్న నోటీసులు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో నిలిచిపోయిన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి



