← Back to news

సీఈసీ రాజీనామా కోరుతూ కాంగ్రెస్ నిరసన

By నిమ్మనగంటి అనిల్ బాబు· 2h ago· Mahabubabad (Ct), Mahabubabad, Mahabubabad
సీఈసీ రాజీనామా కోరుతూ కాంగ్రెస్ నిరసన

మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టాయి. ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితాల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. అర్హులైన ఓటర్లు ఎవరూ హక్కు కోల్పోకూడదని స్పష్టం చేశారు. నిరసనలో సీఈసీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు భూక్య ఉమా మురళి నాయక్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

సీఈసీ రాజీనామా కోరుతూ కాంగ్రెస్ నిరసన

More in Local